వసు, మహేంద్రలకు షాకిచ్చిన రిషి, జగతి
on Nov 25, 2021
బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తున్న సీరియల్ `గుప్పెడంత మనసు`. గ తకొన్ని వారాలుగా సాగుతున్న ఈ సీరియల్ నేడు 301వ ఎపిసోడ్‌లోకి ఎంటరవుతోంది. ఈ గురువారం మరింత రసవత్తరంగా సాగబోతోంది. ఎగ్జామ్ రాసిన తరువాత వసు కోసం ఎదురు చూస్తున్న రిషి తనని తీసుకెళ్లడానికి కార్‌లో ఎదురుచూస్తూ తాను ఎంతకీ రాకపోవడంతో రెండు సార్లు హారన్ మోగిస్తాడు. అది గమనించిన వసు తన ఫ్రెండ్‌ని పంపించేసి రిషి కారెక్కుతుంది.
సీట్‌బెల్ట్ పెట్టుకోమని చెప్పిన రిషి `ఎగ్జామ్ బాగా రాసినట్టున్నావ్ ముఖం వెలిగిపోతోంది.. అప్పుడే రిలాక్స్ అయిపోకు మెషిన్ ఎడ్యుకేషన్ గురించి మరిన్ని ప్లాన్స్ వేయాలి అంటూ రిషి కార్‌ని ముందుకు కదిలిస్తాడు ఇంతలో వసు హఠాత్తుగా కార్ ఆపండి సార్ అని అరుస్తుంది. వాసన అద్భుతంగా వుంది మిర్చి బజ్జీ తిందాం సార్` అంటుంది. మిర్చి బజ్జీ గురించి లెక్చర్ ఇవ్వనంటే వస్తానంటాడు రిషి. సరే అంటుంది వసు. ఇద్దరూ వెళ్లి మిర్చీ బజ్జీలు తినేస్తారు.
కట్ చేస్తే ఎప్పుడూ నిప్పు ఉప్పులా వుండే జగతి - రిషి కార్ వలన కలవాల్సి వస్తుంది. తన కార్‌ని పెదనాన్న తీసుకెళ్లడంతో కార్ కోసం ఎదురుచూస్తుంటాడు రిషి. అయితే తన కార్‌లో డ్రాప్ చేస్తానంటుంది జగతి. అందుకు రిషి అంగీకరించి జగతి కార్ ఎక్కేస్తాడు. రిషి గురించి మహేంద్ర, వసు మాట్లాడుకుంటుండగా జగతి కార్‌లోంచి రిషి దిగడం చూసి మహేంద్ర, వసు షాక్ అవుతారు. ఆ తరువాత ఏం జరిగింది అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
